తెలంగాణ

telangana

ETV Bharat / city

man drowns in nala:మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు - తెలంగాణ తాజా వార్తలు

భారీ వర్షాలు కారణంగా శనివారం రాత్రి హైదరాబాద్​ మణికొండ నాలాలో పడి గల్లంతైన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి రజినీకాంత్​ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నా.. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనుగొనడం క్లిష్టతరంగా మారింది.

man drowns in nala hyderabad
man drowns in nala hyderabad

By

Published : Sep 27, 2021, 5:52 AM IST

హైదరాబాద్‌ మణికొండ నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్‌ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గంటలు గడుస్తున్నా.. ఇంకా అతని ఆచూకీ మాత్రం దొరకలేదు. గల్లంతైన ప్రదేశంతో పాటు నాలాను జల్లెడ పడుతున్న డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు నాలా కలిసే నెక్నాంపూర్‌ చెరువులోనూ తీవ్రంగా గాలిస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనుగొనడం క్లిష్టతరంగా మారింది.

వారి నిర్లక్ష్యమే కారణం!

గుత్తేదారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వం వెరసి ఓ వ్యక్తి గల్లంతవ్వడానికి కారణమైంది. హైదరాబాద్‌ మణికొండ సెక్రటేరియట్‌ కాలనీలో నివసించే రజనీకాంత్‌.. షాద్‌నగర్‌లోని నోవాగ్రీన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని శనివారం రాత్రి సమీపంలోని దుకాణానికి వెళ్తుండగా డ్రైనేజీ పైపులైను పనుల కోసం తవ్విన గుంతలో ఊహించని విధంగా పడిపోయాడు. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. గుంత ఉందని తెలియక రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నీటిలో పడి గల్లంతయ్యాడు. ఘటన జరిగాక.... డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలో దిగి గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. డ్రైనేజీ గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే...చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గాలింపు ఓ సవాల్​..

నెక్నంపూర్ చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు గుర్రపు డెక్క కారణంగా గల్లంతైన రజినీకాంత్‌ ఆచూకీ కనుగొనడం సవాల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. గుర్రపు డెక్క తొలగించి డ్రోన్ల ద్వారా నెక్నంపూర్‌ చెరువు మొత్తం గాలిస్తామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రజనీకాంత్‌ జాడ ఇంకా దొరకకపోవడంపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details