తెలంగాణ

telangana

ETV Bharat / city

భార్యలపై భర్తల క్రూరత్వంలో రాష్ట్రం అయిదో స్థానం - increase in crime in 2019

రాష్ట్రంలో సైబర్‌ నేరాలు అధికమవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో స్వల్పంగా నేరాలు పెరిగినట్టు పేర్కొంది. భార్యలపై భర్తల క్రూరత్వంలో దేశంలో రాష్ట్రం అయిదో స్థానంలో నిలిచింది. పోలీసు కస్టడీ, లాకప్‌ డెత్‌లకు సంబంధించి... రాష్ట్రం, మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచాయని పేర్కొంది.

NCRB reports says a slight increase in crime in 2019
భార్యలపై భర్తల క్రూరత్వంలో రాష్ట్రం అయిదో స్థానం

By

Published : Oct 1, 2020, 9:51 AM IST

భార్యలపై భర్తల క్రూరత్వంలో రాష్ట్రం అయిదో స్థానం

రాష్ట్రంలో 2018తో పోల్చితే 2019లో నేరాలు స్వల్పంగా పెరిగాయని జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. జాతీయ స్థాయిలో 51లక్షల 56వేల 172 నేరాలు నమోదవ్వగా.. రాష్ట్రంలో ఆ సంఖ్య లక్షా 31వేల 254గా ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో లక్షా 26వేల 858 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు, షెడ్యూలు కులాలకు చెందిన వ్యక్తులపై సైబర్‌ మహిళలపై నేరాల్లో పెరుగుదల ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై నేరాల్లో దేశంలో ఉత్తరప్రదేశ్‌ 59వేల 853 కేసులతో తొలిస్థానంలో నిలవగా... 18వేల 394 కేసులతో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2018లో 16వేల 27 కేసులు నమోదయ్యాయి. భార్యలపై భర్తల క్రూరత్వంలో దేశంలో రాష్ట్రం అయిదో స్థానంలో నిలిచింది.

మహిళలపై జరిగిన దాడుల్లో నాలుగో స్థానం

కస్టడీ, లాకప్‌లో మరణాలు దేశవ్యాప్తంగా 31 నమోదవ్వగా.. ఆరు చొప్పున మరణాలతో తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. 2019లో దేశవ్యాప్తంగా షెడ్యూలు కులాలపై జరిగిన నేరాలు 45, 935 కాగా... అందులో రాష్ట్రంలో 3.7 శాతంగా ఉంది. ఈ తరహా కేసులు 2017 లో 1466, 2018 లో 1507, 2019 లో 1690 గా ఉన్నాయి. 2019లో షెడ్యూలు కులాలకు చెందిన మహిళలపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. మానవ అక్రమ రవాణా దేశంతో పాటు రాష్ట్రంలోనూ తగ్గుముఖం పట్టినట్టు నివేదికలో ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. 2019లో అక్రమ రవాణాకు గురైన మహిళల విషయంలో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో అత్యధికంగా 936 మంది అక్రమ రవాణాకు గురికాగా ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. రాష్ట్రంలో అక్రమ రవాణాకు గురైన మహిళలందరికీ పోలీసులు విముక్తి కలిగించడం విశేషం. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న నేరాలు నిరూపించడంలో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తేలిపోయినట్టుగా ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.

విపరీతంగా పెరిగిన సైబర్​ నేరాలు

2019లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం నేరాల్లో హింసాత్మక నేరాల రేటు 31.2 కాగా, తెలంగాణలో 2.1 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో హింసాత్మక నేరాలు, ఆర్థిక నేరాలు ఏటా పెరుగుతున్నాయి. చిన్నారుల అపహరణ కేసుల్లో రాష్ట్రం ఆరో స్థానంలో నిలవగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచింది. ఆర్థిక నేరాల్లో అరెస్టైన మహిళల కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. తెలంగాణ సైబర్‌ నేరాలు 2018లో 1205 జరగ్గా... 2019లో 2691 నేరాలు జరిగాయని వెల్లడించింది.

ఇవీ చూడండి: ఆస్తుల నమోదుకు ఇంటింటికీ వస్తారు.. 'న్యాప్​'లోనే రికార్డు

ABOUT THE AUTHOR

...view details