ఆపరేషన్ సముద్ర సేతు-2 కింద కొవిడ్ సహాయ సామగ్రితో ఐఎన్ఎస్ జలాశ్వ... ఏపీలోని విశాఖ తీరానికి చేరుకుంది. ఇందులో 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లు ఇతర వైద్య సామగ్రి ఉన్నాయి.
భారత్కు చేరిన బ్రూనై, సింగపూర్ ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు - భారత్ తీరానికి చేరిన ఐఎన్ఎస్ జలాశ్వ వార్తలు
బ్రూనై, సింగపూర్ దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ.. ఏపీలోని విశాఖపట్నం తీరానికి చేరింది. ఆ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు భారత్కు సాయంగా వాటిని పంపించాయి.
oxygen cylinders
ఆ దేశాల్లో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు భారత్ కోసం ఈ సామగ్రిని సేకరించి పంపించాయి. వాటిని ఐఎన్ఎస్ జలాశ్వ భారత్కు తీసుకువచ్చింది.