హైదరాబాద్లోని బషీర్బాగ్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కనకదుర్గ, నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పూజల్లో పాల్గొని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు.
బషీర్బాగ్లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్లోని బషీర్బాగ్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బషీర్బాగ్లోని కనకదుర్గ, నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో భక్తులు మూడోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు చెల్లించుకున్నారు.
బషీర్బాగ్లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రదక్షిణలతో పాటు తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. భక్తులు సైతం భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి పూజల్లో పాల్గొంటున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు.
ఇవీ చూడండి: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్రబృందం