దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి పూజలో భాగంగా ఆదివారం బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు. సాయంత్రం సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు - mahankali temple
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు.
మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు