తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2021, 9:34 PM IST

ETV Bharat / city

రాష్ట్రప్రభుత్వానికి జాతీయ మైనారిటీ కమిషన్ ప్రశంసలు

రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న విద్యావిధానంపై జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్‌ రషీద్ సంతృప్తి వ్యక్తం చేశారు. బహదూర్​పురాలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను... రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి షఫీ ఉల్లాతో కలిసి ఆయన తనిఖీ చేశారు.

National Minoriti Commission Vice Chairman Arif Rashid visits Minority Girls' Residential School in Bahadurpura
రాష్ట్ర మైనార్టీ విద్యావిధానంపై జాతీయ మైనారిటీ కమిషన్​ సంతృప్తి

రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న విద్యావిధానంపై జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్‌ రషీద్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వాన్ని, అధికారులను ఆయన ప్రశంసించారు. హైదరాబాద్​ బహదూర్​పురాలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, వంట గది, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శమని... ఆ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి షఫీ ఉల్లా పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానాన్ని అతీఫ్‌ రషీద్​కు ఆయన వివరించారు.

ఇదీ చదవండి:'ఉద్యోగాలివ్వండి.. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'

ABOUT THE AUTHOR

...view details