Stone Lift Competition: ఏపీలోని గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా.. పిరంగిపురం మండలం ములురిపాడులో నిర్వహించిన తొమ్మిదో జాతీయ స్థాయి 102 కేజీల గుండు రాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. పోటీదారులు గుండురాయిని ఎత్తి అలరించారు.
Sankranti Special: 'గుండు' నెత్తగలవా ఓ నరహరి.. దమ్ము చూపగలవా..! - జాతీయ స్థాయి గుండు రాయి ఎత్తే పోటీలు వార్తలు
Stone Lift Competition: సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏపీలోని గుంటూరు జిల్లా ములురిపాడులో జాతీయ స్థాయి గుండు రాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. పోటీదారులు 102 కిలోల గుండరాయిని ఎత్తి అలరించారు.
Sankranti Special
నరసరావుపేట మండలం పమిదిపాడు గ్రామానికి చెందిన మదా వీరాంజనేయులు.. 5 నిమిషాల్లో 30 సార్లు గుండు రాయిని పైకెత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన శోభన్ 28 సార్లు, పిన్నెల్లికి చెందిన రామాంజనేయులు 27 సార్లు పైకెత్తి రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. పోటీలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఇదీచూడండి:Balakrishna Horse Ride: దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య