తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్​కు మోదీ, వెంకయ్య సహా పలువురి శుభాకాంక్షలు - కేసీఆర్ పుట్టిన రోజు వార్తలు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్ సభ సభాపతి ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు.

kcr
kcr

By

Published : Feb 17, 2021, 2:19 PM IST

Updated : Feb 17, 2021, 5:31 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేసీఆర్​కు ఫోన్‌చేసి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం ముఖ్యమంత్రులు భూపేశ్‌, ప్రేమ్‌సింగ్, డీఎంకే అధినేత స్టాలిన్ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

సీఎంకు కేంద్ర మంత్రి గడ్కరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్‌కు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్​సింగ్​ చౌహన్​ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

కేసీఆర్‌కు కర్ణాటక సీఎం యడియూరప్ప పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు కలకాలం కొనసాగాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

ఇదీ చదవండి :'స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్'

Last Updated : Feb 17, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details