తెలంగాణ

telangana

ETV Bharat / city

National Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు - chittoor district latest news

NATIONAL KABBADI: ఏపీలోని తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. గెలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఒలింపియన్ కరణం మల్లీశ్వరి సహా ప్రముఖులు సూచించారు.

National Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
National Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలుNational Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

By

Published : Jan 10, 2022, 10:39 PM IST

NATIONAL KABBADI: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. కబడ్డీ పోటీల ముగింపు వేడుక ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి తెలుగు ఒలింపియన్, దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలైన జట్లకు గోల్డ్ కప్‌, నగదు బహుమతి ప్రదానం చేశారు. క్రీడల్లో ప్రతిభ పాటవాలు ప్రదర్శించి యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కరణం మల్లీశ్వరి ఆకాంక్షించారు.

కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి క్రీడాకారులు ఎంతో నష్టపోయారన్న ఆమె.. ఆ లోటు తీరుస్తూ తిరుపతిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని.. ముగింపు వేడుకల్లో పాల్గొన్న నేతలు అన్నారు. ఇలాంటి క్రీడలను మరెన్నో రాష్ట్రంలో నిర్వహించాలని..ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. కబడ్డీ ముగింపు వేడుకల సందర్భంగా బాణసంచా వెలుగు జిలుగులతో క్రీడా మైదానం మెరిసిపోయింది.

National Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details