జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా జాతీయ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. సినీయర్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఆనందశ్వర్ పాండే, డాక్టర్ ప్రదీప్ కుమార్ బలంచు, ఉపాధ్యక్షులుగా పద్మశ్రీ సత్తపాల్, అమల్ నారాయణ్ పటోవని, రీనా సవీన్, జనరల్ సెక్రటరీగా ప్రీత్ సింగ్ సలూరియా, జాయింట్ సెక్రటరీలుగా తేజ్‌రాజ్ సింగ్, బ్రిజ్ కుమార్ శర్మ, ఎన్ కే శర్మ, వీణా శేఖర్ కోశాధికారిగా వినయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యారు.
'హ్యాండ్ బాల్'ను ఒలంపిక్స్‌కు తీసుకెళ్లడమే లక్ష్యం: జగన్మోహన్ రావు - హెచ్‌బీఏ జాతీయ అధ్యక్షుడు అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఇంటర్వ్యూ
జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. గత నెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
'హ్యాండ్ బాల్'ను ఒలంపిక్స్‌కు తీసుకెళ్లడమే లక్ష్యం: జగన్మోహన్ రావు
ఆదివారం నాడు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రావు... హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలంగాణ వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందన్నారు. హ్యాండ్ బాల్ క్రీడను ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమంటున్న జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇదీ చూడండి:హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా జగన్ మోహన్ ఏకగ్రీవం