తెలంగాణ

telangana

ETV Bharat / city

సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం - National Green Tribunal

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్​ అంగీకరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పథకంపై నమోదు చేసిన కేసును మళ్లీ విచారించాలన్నతెలంగాణ సర్కార్ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది.

NGT agrees to hear Telangana's arguments on Rayalaseema allegations
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం

By

Published : Aug 21, 2020, 12:21 PM IST

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్​లో మరోసారి విచారణ జరగనుంది. తమ వాదనలు వినాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్​ను ఎన్జీటీ విచారణకు స్వీకరించింది. ఈ పథకంపై తమ వాదనలు వినిపించేందుకు, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సమయం సరిపోలేదని... ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పరిశీలించిన ట్రైబ్యునల్... రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినేందుకు అంగీకరించింది. ఈ నెల 28న తుది వాదనలు వింటామని జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేయగా.. ఎన్జీటీ తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్​తో మరోసారి విచారణ జరగనుంది.

ఇదీ చూడండి:గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!

ABOUT THE AUTHOR

...view details