సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాళ్లు, రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని రామంతాపూర్లో ఏర్పాటుచేసిన నేషనల్ సైబర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
హైదరాబాద్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టే.. జాతీయ స్థాయి సెంటర్ - National Cyber Research And innovation Center
సాంకేతికత అభివృద్ధిని అడ్డు పెట్టుకొని.. నేరగాళ్లు చేసే సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్లో మరో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
సైబర్ నేరాలకు చెక్ పెట్టే.. మరో జాతీయ స్థాయి సైబర్ సెంటర్
సైబర్ నేరాలను తగ్గించేందుకు, చిక్కుముడులను విప్పేందుకు నేర పరిశోధన మరింత లోతుగా చేసేందుకు ఈ కేంద్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో గ్లోబల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న హైదరాబాద్లోనే నేషనల్ సైబర్ రీసెర్సి అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం వ్యూహాత్మకమే అన్నారు కిషన్ రెడ్డి. ఈ కేంద్రం సీసీఎంబీ, ఐఐటీ, డీఆర్డీఓ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేయనుంది.