హైదరాబాద్‌లోని సైదాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన గిరిజన బాలిక హత్య, అత్యాచారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ చేపట్టింది. సైదాబాద్, ఖాజాబాగ్‌లో పర్యటించిన కమిషన్ సభ్యులు... బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
గిరిజన బాలిక హత్యాచారంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ విచారణ - saidabad girl rape and murder case
హైదరాబాద్‌లోని సైదాబాద్, ఖాజాబాగ్‌లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటించింది. సైదాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన గిరిజన బాలిక హత్య, అత్యాచారంపై కమిషన్ విచారణ చేపట్టింది. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామని కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్ తెలిపారు
National Child Rights Commission visited in saidabad
పోలీసు, వైద్య శాఖలు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్ ఆదేశించారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామని ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్‌తో చర్చించి బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చే వెళ్తానని స్పష్టం చేశారు.