తెలంగాణ

telangana

ETV Bharat / city

మలక్​పేట టీచర్​ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - teachers awards

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 47 మంది ఉపాధ్యాయులకు అవార్డులను కేంద్రం ప్రకటించగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్​ మలక్​పేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ ప్రియకు అవార్డు దక్కింది.

national best teachers awards
national best teachers awards

By

Published : Aug 21, 2020, 10:27 PM IST

హైదరాబాద్ మలక్​పేటలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 47 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను కేంద్ర విద్యా శాఖ ఖరారు చేసింది. జాతీయ అవార్డు కోసం తెలంగాణ నుంచి ఆరుగురు ఉపాధ్యాయుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది.

వారందరికీ ఈ నెల 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురస్కారాల కమిటీ ముఖాముఖి నిర్వహించగా.... గణితం ఉపాధ్యాయురాలు పద్మప్రియను అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురిని సిఫార్సు చేయగా.. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు జాతీయ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ABOUT THE AUTHOR

...view details