తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాల తొలిగింపుపై నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తొలిగించబడిన 26 వెనుకబడిన కులాల పోరాట సమితి తెలిపింది. కమిషన్ సభ్యుడు టి. ఆచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేష్‌ను... ఫిబ్రవరి 2న దిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు ఆ సమితి అధ్యక్షుడు, విశ్రాంత చీఫ్ ఇంజినీర్ రామకృష్ణ తెలిపారు.
'కులాల తొలగింపుపై నివేదిక కోరిన జాతీయ బీసీ కమిషన్' - తొలగించబడిన కులాల పోరాట సమితి
తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించడంపై జాతీయ బీసీ కమిషన్ నివేదిక కోరింది. ఈ మేరకు జాతీయ కమిషన్ సభ్యుడు ఆచారి, సీఎస్ సోమేశ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేష్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినట్టు... తొలగించబడిన 26 వెనకబడిన కులాల పోరాట సమితి తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా... బీసీ జాబితాలో నుంచి 26 వెనకబడిన కులాలను అన్యాయంగా తొలిగించిందని ఆరోపించారు. దీంతో గత 8 ఏళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన రుసుములు, అడ్మిషన్స్, వివిధ రంగాలలో ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల తొలిగింపుపై జాతీయ బీసీ కమిషన్, రాష్ట్రపతి , కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
ఇదీ చూడండి:త్వరలోనే.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు: పద్మారావు గౌడ్