తెలంగాణ

telangana

ETV Bharat / city

'చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం హరియాణా అసెంబ్లీలో తీర్మానం చేయించండి' - ఆర్​ కృష్ణయ్య వార్తలు

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కలిశారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు సహకరించాలని కోరారు. హరియాణా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని విజ్ఞప్తి చేశారు.

r krishnaiah meet haryana governor bandaru dattatreya
r krishnaiah meet haryana governor bandaru dattatreya

By

Published : Aug 27, 2021, 2:37 PM IST

Updated : Aug 27, 2021, 3:40 PM IST

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు గాను హరియాణా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అందుకు హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యేక చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యతో పాటు పలువురు నాయకులు దత్తాత్రేయను కలిశారు.

బీసీలకు రిజర్వేషన్లపై ఇప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, మహారాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. వివిధ రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే, ఆర్జేడీ, బీఎస్పీ, సమాజ్ వాది పార్టీ, తెరాస, జనతాదళ్ పార్టీలు.. చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని ప్రధానమంత్రికి లేఖలు రాశాయని దత్తాత్రేయకు వివరించారు. వైకాపా రాజ్యసభలో బిల్లు పెట్టిన విషయాన్ని దత్తాత్రేయ దృష్టికి తీసుకువచ్చారు.

బీసీలకు అన్యాయం జరుగుతోంది..

14 రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయని.. దేశంలోని 56 శాతం జనాభా గల బీసీలకు 74 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలిసిన అవసరం ఉందని, అందుకు ముఖ్యమంత్రితో చర్చించి హరియాణా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కోరారు.

అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్​మెంట్ పథకాన్ని హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కూడా మంజూరు చేయాలనీ కోరారు. వివిధ కుల వృత్తుల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి వర్గంలో గుజ్జ కృష్ణ, నందగోపాల్, వేముల రామకృష్ణ, ఉదయ్, సుచిత్ కుమార్, చంటి ముదిరాజ్, అనంతయ్య, తదితరులు ప్రసంగించారు.

స్పందించిన దత్తాత్రేయ.. ఈ అంశాన్ని కేంద్రం, హరియాణా ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు బీసీ సంఘాల నేతలు తెలిపారు.

ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో దత్తాత్రేయను కలిసిన బీసీ సంఘాల నేతలు

ఇదీ చూడండి:రహదారి బాగోలేక.. మూడు కిలోమీటర్లు బాలింత నడక

Last Updated : Aug 27, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details