ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై.. సినీ హీరో నారా రోహిత్ స్పందించారు. 'కూల్చడానికి ఆవాసం కాదు.. అంగట్లో అమ్మడానికి అది వస్తువూ కాదు.. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు' పరిశ్రమ కోసం 32 మంది ప్రాణాలు అర్పించారు.
కూల్చడానికి ఆవాసం కాదు- అమ్మడానికి వస్తువూ కాదు : నారా రోహిత్ - నారా రోహిత్ తాజా వార్తలు
ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై.. సినీ హీరో నారా రోహిత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ.. నేడు ప్రమాదంలో పడుతోందని అన్నారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అని ట్వీట్ చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై హీరో నారా రోహిత్ ట్వీట్
వారి ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని రోహిత్ ట్వీట్ చేశారు. పరిశ్రమ కోసం 22 వేల ఎకరాలను రాసిచ్చారు. నేడు మన ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం ప్రమాదంలో పడుతోంది. సమష్టిగా ఉద్యమించి కాపాడుకోవాల్సిన అవసరముందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.