గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ వైద్యుడు సుధాకర్‌కు నివాళులర్పించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకుని.. సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
విశాఖలో పర్యటించనున్న తెదేపా నేత నారా లోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏపీలోని విశాఖలో పర్యటించనున్నారు. గుండెపోటుతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న లోకేశ్
విశాఖకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ.. ఏపీ పోలీస్ శాఖకు లోకేశ్ దరఖాస్తు చేసుకున్నారు. వైద్యుడు సుధాకర్ కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు