సామాజిక మాధ్యమాల్లో పోస్టుల నెపంపై పోలీసులు వృద్ధులను వేధించటం చూస్తుంటే... వైకాపా పనైపోయిందన్నది సుస్పష్టమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉగాండాలో ఉన్న ఓబుల్ రెడ్డి... ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే ఆయన తండ్రిని పోలీస్ స్టేషన్‌కి పిలిచి హెచ్చరించి, హింసించారని ఆరోపించారు.
Nara Lokesh Comments: 'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!' - telangana news
ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడని పోలీసులు హింసించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఈ ఘటన చూస్తే వైకాపా పనైపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించారు.
నారా లోకేష్, నారా లోకేష్ లేటెస్ట్ అప్డేట్స్
వైకాపా నేతలు పోలీసు వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకున్నారనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్లో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీ చూడండి:Huzurabad by elections 2021: హుజూరాబాద్‌లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!