తెలంగాణ

telangana

ETV Bharat / city

Lokesh: 'రిపబ్లిక్' సినిమా గురించి లోకేశ్ ట్వీట్ - republic movie news

త్వరలోనే 'రిపబ్లిక్' సినిమా చూడనున్నట్లు వెల్లడించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(lokesh tweet about republic movie news). సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్(sai dharam tej) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Lokesh: 'రిపబ్లిక్' సినిమా గురించి లోకేశ్ ట్వీట్
Lokesh: 'రిపబ్లిక్' సినిమా గురించి లోకేశ్ ట్వీట్

By

Published : Oct 3, 2021, 4:02 PM IST

రిపబ్లిక్ సినిమా(republic movie news) గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు(lokesh tweet about republic movie news). త్వరలోనే సినిమా చూడనున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్(sai dharam tej news) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

వైకాపా నేతలు.. జనసేన కార్యకర్తలు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నారు. అధికారపార్టీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష తెలుగుదేశం సమర్థించింది. ఈ నెల ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదలను నరసన్నపేటలో వైకాపా శ్రేణులు అడ్డుకోవటమూ వివాదాస్పదమైంది. రాజకీయ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా లోకేశ్ ట్వీట్ చేయటం రాజకీయ వర్గాలు, మెగా ఫ్యాన్స్​లోనూ చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:BANDI SANJAY : అమ్మవారి ఆశీస్సులతో హుజూరాబాద్​లో జయకేతనం ఎగరేస్తాం

ABOUT THE AUTHOR

...view details