తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్పీపై లోకేశ్​ ఫైర్​: కులపిచ్చి ఉంటే ఖాకీ డ్రెస్ తీసి.. - Guntur Urban SP Ammi Reddy News

ఏపీలోని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. ప్ర‌జ‌ల సొమ్ము జీతంగా తీసుకుని తాడేప‌ల్లి ఇంటికి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాపై పోస్టులు పెట్టారని తాము కేసులు పెడితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతమందిని అరెస్ట్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. కుల‌పిచ్చి ఉంటే ఖాకీ డ్రెస్ తీసి.. బులుగు కండువా కప్పుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు.

nara lokesh on ammi reddy
ఎస్పీపై లోకేశ్​ ఫైర్​: కులపిచ్చి ఉంటే ఖాకీ డ్రెస్ తీసి..

By

Published : May 19, 2021, 6:14 PM IST

ఏపీలోని గుంటూరు అర్బన్​ ఎస్పీపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ద‌గ్గ‌ర ప‌నిచేయాల‌నే ఉత్సాహం, కుల‌పిచ్చి ఉంటే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప‌విత్ర‌మైన ఖాకీ డ్రెస్ తీసి.. బులుగు కండువా కప్పుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అరండల్​పేట పోలీసు స్టేషన్ వద్ద ఎస్పీ పెట్టిన మీడియా సమావేశం వీడియోను తన ట్విటర్​కు జత చేశారు లోకేశ్.

ప్ర‌జ‌ల సొమ్ము వేతనంగా తీసుకుని తాడేప‌ల్లి ఇంటికి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా అని నిలదీశారు. సోష‌ల్‌ మీడియాలో వీడియో పెట్టిన‌వాళ్ల‌ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు ఏంటా ఓవ‌రాక్ష‌న్‌ అని మండిపడ్డారు. తెదేపాపై పోస్టులు పెట్టారని తాము కేసులు పెడితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతమందిని అరెస్ట్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై కేసు పెట్ట‌డానికి వ‌చ్చిన‌ వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ.బెల్ట్​షాపులకు మినహాయింపా..? ఒకటింటికి కూడా మందు అమ్ముతుండ్రు..!

ABOUT THE AUTHOR

...view details