Nara Lokesh on Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. పేలని జ'గన్' హస్తిన పయనమెందుకో అనే అంశంపై తమ అభిప్రాయలు చెప్పాలంటూ... నాలుగు ప్రశ్నలు సంధిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బాబాయ్ హత్యలో దొరికిన అవినాశ్‌రెడ్డిని తప్పించేందుకు దిల్లీ పర్యటనకు వెళ్తున్నారా? అని లోకేశ్ ప్రశ్నించారు. లేకపోతే 48 వేల కోట్ల వ్యవహారాన్ని బయటికి తీసిన కాగ్ అంశంపై మొర పెట్టుకునేందుకా అని నిలదీశారు. అవీ కాకుంటే సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని కోరేందుకు జగన్ దిల్లీ వెళ్తున్నారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు చట్టం రద్దు చేయాలని అడుగుతారా అన్నది చెప్పాలంటూ ప్రజాభిప్రాయాన్ని నారా లోకేశ్ కోరారు.
Nara Lokesh on Jagan: జగన్ దిల్లీ టూర్‌పై లోకేశ్ సెటైర్లు.. ట్విట్టర్‌లో ఒపీనియన్ పోల్ - nakka anand babu latest news
Nara Lokesh on Jagan: ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. పేలని జ'గన్' హస్తిన పయనమెందుకో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని నాలుగు ప్రశ్నాస్త్రాలు సంధించారు.
సీఎం పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు:రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై మొట్టికాయలు వేసేందుకే ప్రధాని మోదీ.. సీఎంను దిల్లీ పిలిపించుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ఇటీవల ఉన్నతాధికారులు ఏపీలో శ్రీలంక పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని వివరించినందున.. దానిపై వివరణ ఇచ్చేందుకే సీఎం దిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆయన తెలిపారు. శ్రీలంకలో గడ్డు పరిస్థితులకు అక్కడి అధ్యక్షుడు రాజపక్సే.. అవినీతి, నియంత ధోరణి, విపరీతమైన అప్పులు, ఆర్థిక సంక్షోభమే కారణమన్న నక్కా ఆనంద్‌బాబు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ శ్రీలంకకి దగ్గర పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు. శ్రీలంకలోనూ ఏపీ తరహాలో ఆర్థిక క్రమశిక్షణ లోపించటంతోనే తాజా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని జగన్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.
ఇదీ చదవండి:CBN and Lokesh: 'తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది'