తెలంగాణ

telangana

ETV Bharat / city

చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి లోకేశ్ లేఖ - కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లేఖ

Lokesh Letter to Nirmala Sitaraman: చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని ఆయన లేఖలో ప్రశ్నించారు. దేశ వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకి ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.

NARA LOKESH  LETTER
NARA LOKESH LETTER

By

Published : Mar 5, 2022, 5:16 PM IST

Lokesh Letter to Nirmala Sitaraman: చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని ఆయన లేఖలో ప్రశ్నించారు.

ముడిసరుకులపైనా 25శాతం మేర పన్ను పెంచినందున రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి పోయాయన్నారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాయితీలు, రుణాలు అందజేయాలన్నారు.

ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 లక్షల మంది చేనేత రంగం పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారని వివరించారు. దేశ వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకి ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖద్దరు, కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ చీరలు, మంగళగిరి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయని వివరించారు.

ఇదీ చదవండి:ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ది: హరీశ్‌రావు

ABOUT THE AUTHOR

...view details