Nara Lokesh on VSP movement: విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ ఉక్కు కార్మికులకు నారా లోకేశ్ ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తెదేపా వ్యతిరేకిస్తోందని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంటు వరకు తెదేపా ఏడాది పొడవునా... నిరసన గళం వినిపిస్తూనే ఉందని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు.
ప్రైవేటీకరణపై సీఎం మాట్లాడకపోవడం బాధాకరం..
విశాఖ ఉక్కు ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్, వైకాపా ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని స్పష్టం చేశారు.