ఏపీలోని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా.. వైకాపా పాత పాటే పాడుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు: లోకేశ్ - చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై లోకేశ్ మండిపాటు వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబుపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి వైకాపా దిగజారిందని ఆగ్రహించారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
"21 నెలల పాటు శోధించి అలసిపోయి.. ఆఖరికి జగన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు" అని మండిపడ్డారు. అమరావతిని అంతం చేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనను తానే కాపాడుకుంటుందని తెలిపారు.
- ఇదీ చదవండి :తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు