Lokesh On Jagan: శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ఏపీ ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని విమర్శించారు. కల్తీ మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన వినివెళ్లిపోవాలంటే ఎలా అని నిలదీశారు.
శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : లోకేశ్ - కల్తీ సారా మరణాలపై లోకేశ్ కామెంట్స్
Lokesh On Jagan: కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ఏపీ ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా మారారని ఆయన ధ్వజమెత్తారు.
![శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : లోకేశ్ nara nara lokesh on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14731605-999-14731605-1647267610976.jpg)
ఏపీలో మద్యం దుకాణాల కాలపరిమితిని పెంచి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. పేద ప్రజలు అధిక ధరలకు సర్కారీ మద్యం కొనలేక కల్తీసారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కల్తీసారా మరణాలపై న్యాయ లేదా సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలకు జగన్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, బీటెక్ రవి డిమాండ్ చేశారు.
ఇదీచూడండి:Chandrababu: కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి