తెలంగాణ

telangana

ETV Bharat / city

నారా లోకేశ్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు - నారా లోకేశ్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన నడుపుతున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు ఓ వైపు ఒరిగింది. ఆ సమయంలో చినబాబు వెంట తెదేపా నేతలు ఉన్నారు.

నారా లోకేశ్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు
నారా లోకేశ్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు

By

Published : Oct 26, 2020, 6:08 PM IST

నారా లోకేశ్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపు ప్రాంతాలను లోకేశ్‌ పరిశీలించేందుకు ఆకివీడు నుంచి సిద్ధాపురానికి ట్రాక్టర్‌ నడుపుతూ వెళ్లారు. లోకేశ్‌ వెంట ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు.

సిద్ధాపురం సమీపానికి వచ్చేసరికి ట్రాక్టర్‌ ఒక వైపుకు వెళ్లిపోగా సమీపంలోని ఉప్పుటేరు అంచుకు కుంగిపోయింది. ట్రాక్టర్‌ను చాకచక్యంగా నిలిపేయగా త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతరం పక్కనే ఉన్న ముంపు ప్రాంతాలను లోకేశ్‌ పరిశీలించారు.

ఇదీ చూడండి:షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు

ABOUT THE AUTHOR

...view details