తెలంగాణ

telangana

ETV Bharat / city

'కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాక్కుంటున్నారు' - నారా లోకేశ్ తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వం.. కుడిచేతితో రూ.పది ఇచ్చి ఎడమ చేతితో రూ.వంద లాక్కుంటోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదరర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగించారు.

nara lokesh at Tirupati
'కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాక్కుంటున్నారు'

By

Published : Apr 5, 2021, 10:42 PM IST

'కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో లాక్కుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి నగరంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విస్తృతంగా ప్రచారం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ కూడలిలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం కుడి చేతితో రూ.పది ఇచ్చి ఎడమచేతితో రూ.వంద లాక్కుంటున్నారని విమర్శించారు. జగన్​ పాలనలో ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి కుంటు పడిందన్నారు. తాను ఐటీ మంత్రిగా 35 వేల ఉద్యోగాలు తెచ్చానని.. వైకాపా హయాంలో రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా తెచ్చారా అని నిలదీశారు. తెదేపా పాలనలో తిరుపతికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. జగన్​ హయాంలో కనీసం పైవంతెనల నిర్మాణాలు సైతం ముందుకెళ్లడం లేదని విమర్శించారు.

సభకు ముందు.. ఇంటింటి ప్రచారం

నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు నారా లోకేశ్. కృష్ణాపురం ఠానా నుంచి చిన్న బజార్ వీధి మీదుగా తిలక్ రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్​లో చోటు చేసుకుంటున్న దుర్భర పరిస్థితులను ప్రజలకు వివరించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాదికి చెందిన మార్వాడి వ్యాపారులతో మచ్చటించిన లోకేశ్.. వారి బాగోగులపై ఆరా తీశారు. ప్రచారంలో పాల్గొంటున్న యువత.. లోకేశ్​తో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. యువతను చిరునవ్వుతో పలకరిస్తూ.. సెల్ఫీలు ఇచ్చారు.

ఇదీ చూడండి:జిల్లాలో పోలీసులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details