పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభిస్తే, ఏపీ పరిస్థితి ఏంటని నిలదీయకుండా.. ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలు పాల్గొనడమేంటని తెలుగుదేశం ధ్వజమెత్తింది. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్న ఏపీ సీఎం జగన్.. వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల గురించి కాకుండా ఇప్పటికైనా ప్రత్యేకహోదా గట్టిగా అడగాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైకాపా నేతల ఫొటోలను లోకేశ్ ట్వీట్ చేశారు.
ఏపీకి హోదా సాధ్యం కాదన్న భాజపా.. పుదుచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. హోదా తెస్తామన్న జగన్.. ఇప్పుడు ప్రజల తరుఫున పోరాటం చేయకుండా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మిగుల్చుతున్నారు: లోకేశ్