వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ నుంచి అనంతపురం బయలుదేరారు. బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 గా మారుస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో 2 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
తాడిపత్రికి బయల్దేరిన లోకేశ్.. జేసీ కుటుంబానికి పరామర్శ - నారా లోకేష్ తాజా వార్తలు
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురానికి బయలుదేరారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అరెస్టయ్యారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని నారా లోకేశ్ పరామర్శించనున్నారు
విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో వీరిని ఏపీలోని కడప జైలుకు తరలించారు. పరామర్శించేందుకు అధికారులను లోకేశ్ అనుమతి కోరగా... కొన్ని కారణాల వలన నిరాకరించారు. దీనితో ఆయన ఇవాళ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.