ఇంటి వద్దే చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఎన్టీఆర్ ట్రస్టు (NTR TRUST) తరఫున మరో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ట్రస్టు కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు ఇప్పటికే అందుబాటులోకి 10 కాన్సన్ట్రేటర్లను ఉంచామని.. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన వాటితో మెుత్తం సంఖ్య 40కి చేరుకుంటుందని పేర్కొన్నారు.
Nara Bhuvaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరో 30 కాన్సట్రేటర్లు: నారా భువనేశ్వరి
కరోనా రోగుల కోసం కొత్తగా మరో 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
"ఏపీ, తెలంగాణల్లో నిర్మిస్తున్న 6 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో ఆక్సిజన్ సమస్య తీరే అవకాశం ఉంది. ఆన్లైన్ టెలీ మెడిసిన్ ద్వారా లోకేశ్వరరావు నేతృత్వంలో 10మందికి పైగా వైద్య నిపుణుల బృందం నిత్యం రోగులకు తమ సేవలను ట్రస్టు ద్వారా అందిస్తోంది. ఇప్పటివరకు 720 మందికి ఆన్ లైన్ వైద్య సేవలు అందించగా.. 416 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంటిలోనే ఉండి చికిత్స పొందుతున్న వారికి తెలుగుదేశం పార్టీ తరఫున భోజనం, మందుల పంపిణీ చేస్తున్నాం. అనాథశవాలకు వారి ఆచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం." - నారా భువనేశ్వరి