సంగారెడ్డిలోని మహేశ్వర వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్-95 మాస్క్‌లను అందజేసింది. ఆసుపత్రి డైరెక్టర్, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వాటిని స్వీకరించారు. మహేశ్వర వైద్య కళాశాల వైద్య సేవలే కాకుండా సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుండటం అభినందనీయమని బాలకృష్ణ ప్రశంసించారు.
కరోనాపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య
కరోనాపై పోరులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారిపై పోరులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బాలయ్య ఆకాంక్షించారు.
కరోనాపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య
కరోనా మహమ్మారిపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాలయ్య కోరారు. ఈ పోరులో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పని చేయాలన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షించారు. ప్లాస్మా దానం చేసి వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'భద్రాచలం ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ వైద్యసిబ్బంది'