కరోనా నివారణకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో తీసుకుంటున్న చర్యలను ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. లోపలికి ప్రవేశించే ముందు స్క్రీనింగ్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులతో పాటు వచ్చిన వారు వేచి ఉండేందుకు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. పేషంట్లను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 400 వందలకు పైగా హౌస్ కీపింగ్ సిబ్బందికి నిత్యావస సరకులు పంపిణీ చేశారు.
బసవతారకం ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ - balakrishna visit basavatharakam hospital
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నందమూరి బాలకృష్ణ సందర్శించారు. కరోనా నివారణకు ఆసుపత్రిలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. లాక్డౌన్ అమలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి సూచనలు చేశారు. పలువురు సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

బసవతారకం ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ
దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రిలో తిరిగి వివిధ విభాగాలను బాలకృష్ణ పరిశీలించారు. లాక్‌డౌన్‌తోపాటు అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై తగిన సూచనలు చేశారు. ఆసుపత్రిలో తీసుకుంటోన్న చర్యలు... బసవతారకం ఆసుపత్రి, పరిశోధన సంస్థ సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు వివరించారు. వైద్యులు రవి కుమార్, ఫణి కోటేశ్వర రావు, వైద్య, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భారత్‌కు వచ్చేందుకు ఒక్కరోజే 32 వేల మంది దరఖాస్తు