స్వర్గీయ నందమూరి తారకరామారావు రక్తంలోనే నిజాయతీ, క్రమశిక్షణ ఉన్నాయని ఆయన తనయుడు, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన మహనీయుడు అని కీర్తించారు.
'ఎన్టీ రామారావు రక్తంలోనే క్రమశిక్షణ ఉంది' - Tollywood hero Balakrishna's tribute to NTR
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన స్వర్గీయ ఎన్టీరామారావు తనను తాను అర్చకుడిగా భావించి ఎన్నో సేవలందించారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బేగంపేట్ రసూల్‌పురాలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమంలో బాలకృష్ణ
ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ ప్రశంసించారు. చావుపుట్టుకలతో సంబంధం లేని వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు పోషించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అని అభివర్ణించారు.
హైదరాబాద్ బేగంపేట్ రసూల్‌పురాలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలయ్య నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేతలు, అభిమానులు ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Last Updated : Jan 18, 2021, 12:16 PM IST