ఆసుపత్రి వద్ద తమ కుమార్తె మృతదేహాన్ని చూసిన నాగమణి తల్లిదండ్రులు బోరున విలపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన రమణమూర్తి, జానకిల కుమార్తె అయిన నాగమణి.. కొన్నేళ్లుగా తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
టీవీల్లో చూసి ఏడుస్తూ వచ్చాం.. నాగమణి తల్లిదండ్రుల ఆవేదన - తెలంగాణ వార్తలు
పెద్దపల్లిలో న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య గురించి.. పోలీసులు కనీసం తమకు సమాచారమైనా ఇవ్వలేదని నాగమణి తల్లిదండ్రులు వాపోయారు. టీవీల్లో చూసి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణంగా హత్య చేసిన దృశ్యాలను టీవీల్లో చూసిన వారు.. హుటాహుటిన పెద్దపల్లికి చేరుకున్నారు.

టీవీల్లో చూసి ఏడుస్తూ వచ్చాం.. నాగమణి తల్లిదండ్రుల ఆవేదన
అక్కడే న్యాయవాద వృత్తిలో ఉన్న మంథనికి చెందిన వామన్‌రావును ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిని దారుణంగా హత్య చేసిన దృశ్యాలను టీవీల్లో చూసిన నాగమణి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమై.. హుటాహుటిన బయలుదేరి గురువారం ఉదయం పెద్దపల్లికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు కనీసం తమకు సమాచారమైనా ఇవ్వలేదని, టీవీల్లో చూసి వచ్చామని వాపోయారు.
ఇదీ చూడండి:బిట్టు శ్రీను... లాయర్ దంపతుల హత్య కేసులో కొత్త పేరు