తెలంగాణ

telangana

ETV Bharat / city

టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌: నాగం - కేసీఆర్ టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన నాగం జనార్ధన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సినీయర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.

nagam janardhan reddy fire on cm kcr at hyderabad
టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌: నాగం

By

Published : May 7, 2020, 3:50 PM IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో... ప్రజలు కష్టకాలంలో ఉంటే సీఎం టెండర్లపై దృష్టి పెట్టడం ఏంటని కాంగ్రెస్ సినీయర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు కోసం మళ్లీ 1200కోట్ల టెండర్లు పిలిచారని... రాష్ట్రంలో డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి టెండర్లు పిలుస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ టెండర్లను రద్దు చేయాలని నాగం డిమాండ్ చేశారు.

పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు మళ్లించుకుపోతే తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యవహారంపై అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీళ్ల దోపిడిపై సీఎం కేసీఆర్ కోర్టుకు వెళ్లాలన్నారు.

ఇదీ చూడండి:విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details