తెలంగాణ

telangana

ETV Bharat / city

పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలి: నాగబాబు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సూచించారు. ఏపీలో జరిగిన అమరావతి ఉద్యమంలోని మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర జనసేన కార్యాలయంలో వీర మహిళల శిక్షణ తరగతులను నాగబాబు ప్రారంభించారు.

Janasena
Janasena

By

Published : Jul 2, 2022, 2:39 PM IST

Training classes for womens at Mangalagiri Janasena office: ఏపీలో జరిగిన అమరావతి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు రాజకీయాల్లోకి రావాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సూచించారు. మంగళగిరిలోని రాష్ట్ర జనసేన కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల వీర మహిళల శిక్షణ తరగతులను నాగబాబు ప్రారంభించారు.

పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని అభిలాషించారు. గత 928 రోజులుగా రాజధాని మహిళలు శాంతియుతంగా తమ లక్ష్యం కోసం చేస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోతున్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాగబాబు చెప్పారు.

మహిళలు రాజకీయాల్లో రాణించాలి: నాగబాబు

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details