తెలంగాణ

telangana

ETV Bharat / city

naga chaitanya: సమంతతో​ ఆన్​స్క్రీన్​​ కెమిస్ట్రీ బాగా కుదిరింది: నాగచైతన్య - undefined

Samantha naga chaitanya: విడాకుల తర్వాత తన మాజీ భార్య సమంత గురించి హీరో నాగచైతన్య మరోసారి మాట్లాడారు. సమంతతో తనకు ఆన్​స్ర్కీన్​లో అద్భుతమైన కెమిస్ట్రీ పండిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

naga chaitanya: సమంతతో​ ఆన్​స్క్రీన్​​ కెమిస్ట్రీ బాగా కుదిరింది: నాగచైతన్య
naga chaitanya: సమంతతో​ ఆన్​స్క్రీన్​​ కెమిస్ట్రీ బాగా కుదిరింది: నాగచైతన్య

By

Published : Jan 17, 2022, 6:41 AM IST

Bangarraju movie: 'బంగార్రాజు' ప్రమోషన్స్​లో నాగచైతన్య, తన విడాకుల గురించి హుందాగా సమాధానమిచ్చారు. అలానే మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్​లోని ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి మాట్లాడారు.

మీతో ఏ హీరోయిన్​కు బాగా కెమిస్ట్రీ కుదిరింది? అని అడగ్గా.. సమంత పేరునే టక్కున చెప్పారు. అభిమానుల మనసుల్ని మరోసారి గెలుచుకున్నారు.

అంతకు ముందు 'బంగ్రారాజు' ఇంటర్వ్యూలోనూ తన విడాకుల విషయమై చైతూ మాట్లాడారు. 'ఇద్దరి మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇది మా మధ్య ప్రత్యేకమైన బంధాన్ని నిలిపి ఉంచుతుందని నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. ముందడుగు వేయడానికి మాకు అవసరమైన గోప్యతని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని చైతూ అన్నారు.

'బంగార్రాజు' థియేటర్లలో సందడి చేస్తున్న చైతూ.. ప్రస్తుతం 'థాంక్యూ' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఓ వెబ్ సిరీస్​ కూడా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details