తెలంగాణ

telangana

ETV Bharat / city

కొణిదెల నిహారిక వివాహానికి ముహూర్తం ఖరారు - నాగబాబు కుమార్తె వివాహం

కొణిదెల నిహారిక, చైతన్య జొన్నగడ్డల వివాహానికి పెద్దలు తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు వరుడి తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి జె.ప్రభాకర్​రావు తెలిపారు. తిరుమల శ్రీవారి చెంత వివాహ పత్రిక ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు.

konidela niharika
konidela niharika

By

Published : Nov 4, 2020, 5:45 PM IST

మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి పెద్దలు ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్‌ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు వరుడి తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు తెలిపారు.

తిరుమల శ్రీవారి దర్శించుకొని.. వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వివాహ వేదికతో పాటు సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ వేదికగా పెళ్లి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభాకరరావు తెలిపారు.

నిహారిక వివాహానికి ముహుర్తం ఖరారు

ఇదీ చూడండి:దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు

ABOUT THE AUTHOR

...view details