ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్... మంగ్లీ పాడిన పాటకు బహిరంగ సభలో డాన్స్ చేశారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్... ఆరు మండలాల్లో పాదయాత్ర చేపట్టారు.
మంగ్లీ పాటకు చిందులు తొక్కిన వైకాపా ఎమ్మెల్యే - నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ డాన్స్
ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్... ఓ పాటకు చిందేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభలో గాయని మంగ్లీ పాటలు అలరించాయి. మంగ్లీ పాడిన ఓ పాటకు ఎమ్మెల్యే డాన్స్ చేశారు.
మంగ్లీ పాటకు చిందులు తొక్కిన వైకాపా ఎమ్మెల్యే
ఇవాళ ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా పట్టణంలోని పటేల్ కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంగ్లీ పాటలు పాడారు. మంగ్లీ పాడిన పాటకు స్టేజ్‌పై ఉన్న ఎమ్మెల్యే డ్యాన్స్ చేశారు.