తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్​కు ఎంతో నచ్చిన ఫొటో ఇది! - minister ktr news

మంత్రి కేటీఆర్​ను ఓ ఫొటో ఆకట్టుకుంది. ఈ వారంలో తనకు నచ్చిన ఫొటో అంటూ ట్వీట్ చేశారు. ఐదుగురు పిల్లలు ఎంతో నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఫొటోను చాలా మంది లైక్​ చేశారు. కామెంట్స్ చేశారు.

ktr
ktr

By

Published : Apr 12, 2020, 4:51 PM IST

Updated : Apr 12, 2020, 5:27 PM IST

లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయడంలో ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ ఫొటో మంత్రి కేటీఆర్‌ మనసును ఆకట్టుకుంది. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. లోకం తెలియని వీరు కూడా భౌతిక దూరం పాటించడంతో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దీన్ని కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ వారంలో నాకు ఎంతో నచ్చిన ఫొటో ఇది. ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు భౌతిక దూరం గురించి నేర్పిస్తున్నారు’ అంటూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ ఫొటోను చాలా మంది లైక్‌ చేశారు. తమకు ఎదురైన అనుభవాలను షేర్‌ చేశారు. ‘మార్కెట్‌ దగ్గర పెద్దలే దూరం పాటించడం లేదు, పెద్దలకంటే పిల్లలే మేలు, స్వీట్‌, సూపర్‌, తర్వాతి జనరేషన్‌ స్ఫూర్తినిస్తోంది..’ అంటూ కామెంట్లు చేశారు.

ఇదీ చదవండి:చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది

Last Updated : Apr 12, 2020, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details