నుపూర్‌కు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన.. అరెస్టు చేయాలని డిమాండ్ - Muslim Protest in mehadipatnam
15:54 June 10
నుపూర్‌కు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన.. అరెస్టు చేయాలని డిమాండ్..
Muslims Protest in Hyderabad: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లోని పలు చోట్ల ముస్లింలు నిరసనకు దిగారు. నగరంలోని పలు మసీదుల్లో మధ్యాహ్నం ప్రార్థన అనంతరం.. కొంత మంది ముస్లింలు ఆందోళనకు దిగారు. నుపూర్శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీసినందుకు నుపూర్‌శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ మక్కామసీద్‌లో నమాజ్ ప్రార్థనల అనంతరం పలువురు యువకులు నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. పోలీస్ ఉన్నతాధికారులు చార్మినార్ వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. అయినప్పటికీ.. ప్రార్థన అనంతరం.. ముస్లింలు పెద్దఎత్తున రావటంతో కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. మెహదీపట్నం కూడలి వద్ద ఉన్న అజీజియా మసీదు వద్ద కూడా.. ముస్లింలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనకారులు రోడ్డుపైకి రావటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
ఇవీ చూడండి: