తెలంగాణ

telangana

ETV Bharat / city

'అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒకేరోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన' - కేసీఆర్​ హామీ

cm kcr assurance to muslim organizations representatives to construct prayer halls in new assembly
'అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒకేరోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన'

By

Published : Sep 5, 2020, 2:37 PM IST

Updated : Sep 5, 2020, 5:34 PM IST

14:35 September 05

'అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒకేరోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన'

ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసిన ముస్లిం సంస్థల ప్రతినిధులు

ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను ముస్లిం సంస్థల ప్రతినిధులు కలిశారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర సంస్థల ప్రతినిధులు కేసీఆర్​తో సమావేశమయ్యారు. సచివాలయ ప్రాంగణంలోని మసీదుల విషయమై చర్చ జరిగింది. కొత్త సచివాలయంలో మందిరం, మసీదు, చర్చి నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే మందిరం, మసీదు, చర్చి నిర్మిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒకేరోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తేలిపారు. గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకేరోజు శంకుస్థాపన జరగుతుందన్నారు. త్వరితగతిన నిర్మాణాలు కూడా  పూర్తి చేస్తామని సీఎం వివరించారు.

పరమత సహనం పాటిస్తున్నాం..

ఒక్కో ప్రార్థనా మందిరం 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తాం. ఇమామ్ క్వార్టర్స్‌తో సహా 2 మసీదులను నిర్మిస్తాం. పాత సచివాలయంలో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం చేపడతాం. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తాం. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తాం. క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది. రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది, పరమత సహనం పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. - కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి.

హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ 

ముస్లిం అనాథ పిల్లలకు అనీస్-ఉల్-గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ీ నిర్మాణం 80 శాతం పూర్తయిందని తెలిపారు. మరో రూ.18 కోట్లు విడుదల చేసి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ నిర్మిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఇస్లామిక్ సెంటర్ కోసం స్థలం కూడా కేటాయించామని వెల్లడించారు. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది వివరించారు. వెంటనే ఇస్లామిక్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 

రెండో అధికార భాషగా ఉర్దూ..

నగరం చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావాల్సిన అవసరం ఉంది. స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించాం. నగరంలో వివిధ చోట్ల 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తున్నాం. ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడతాం. అధికార భాషా సంఘంలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. అధికార భాషా సంఘంలో ఉర్దూ భాషకు చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తాం - కేసీఆర్​, సీఎం. 


ఇవీ చూడండి:తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్​ రెడ్డి సమీక్ష

Last Updated : Sep 5, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details