పాకిస్థాన్‌లో గురుద్వారపై ముస్లింల దాడికి నిరసనగా.. సికింద్రాబాద్ కీస్ హైస్కూల్ వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు. సిక్కులపై జరుగుతున్న అరాచకం, అవమానాలకు వ్యతిరేకంగా వారు నినదించారు. పాక్‌లోని సిక్కు మతస్తులపై ముస్లింల ధోరణి సరికాదని పేర్కొన్నారు. పాక్ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని హితవు పలికారు. గురుద్వారలపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక చేయాలని కోరారు.
"పాక్‌లో గురుద్వారపై దాడి.. హేయమైన చర్య" - Protests in Jammu against mob attack on gurdwara in Pakistan
సికింద్రాబాద్ కీస్ హైస్కూల్ వద్ద సిక్కులు ఆందోళనకు దిగారు. సిక్కుల పై జరుగుతున్న దాడులను ఖండించారు. గురుద్వారలపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరిక చేయాలని కోరారు.
"పాక్‌లో గురుద్వారపై ముస్లింల దాడి.. హేయమైన చర్య"