తెలంగాణ

telangana

ETV Bharat / city

మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన సుధీర్​రెడ్డి

మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం బడ్జెట్​లో రూ.10 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పనులు పురోగతిని పరిశీలించేందుకు నది పరివాహక ప్రాంతాల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు.

musi river front development
మూసీ నది ప్రక్షాళన

By

Published : Mar 9, 2020, 4:43 PM IST

మూసీనది పరివాహన ప్రాంతంలో జరుగుతోన్న పనులను, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. అంబర్‌పేట్‌ ఎస్‌టీపీ, అలీకేఫ్, నాగోల్‌, ఉప్పల్ బ్రిడ్జ్​, ఎల్బీనగర్‌లోని చైతన్యపురి, భవానీ నగర్, ఫణిగిరి కాలనీ, ద్వారకాపురం, చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్​ తదితర ప్రాంతాల్లో సుధీర్​ రెడ్డి పర్యటించారు. మూసీ పరీవాహక ప్రాంత సుందరీకరణ, అవసరమైన ప్రదేశాల్లో ట్రాక్‌ నిర్మాణం, నదికి ఇరువైపులా వెయ్యి మీటర్ల చొప్పున రోడ్లు ఏర్పాటు, పార్కులు అభివృద్ధి కోసం తీసుకొంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నదిని ఆక్రమించకుండా..

అధికారుల కళ్లుగప్పి మూసీలో వేస్తున్న మట్టి దిబ్బలు, వేస్టేజీని తక్షణం తొలగించాలని అధికారులను సుధీర్ రెడ్డి ఆదేశించారు. నదిని ఆక్రమించకుండా పరివాహక ప్రాంత వాసులు జాగ్రత్త పడాలని సూచించారు. నది నుంచి 330 అడుగుల లోతు బోర్లు వేసి.. నీటిని రైతులకు అందజేయాలన్నారు. ఈ నీటి ద్వారా పెరిగిన గడ్డి క్వాలిటీ, గడ్డిని తిన్న పశువుల పాల క్వాలిటీ, పండ్లు, కూరగాయలు, ధాన్యం క్వాలిటీ ఏ విధంగా ఉందో పరిశీలించి రిపోర్ట్​ సిద్ధం చేయాలని ఆదేశించారు. మూసీనదిలో నీటిని చేపల ల్యాబ్‌కు పంపించి నివేదిక ఇవ్వాలని సూచించారు.

పనులు వేగవంతం చేయండి..

రానున్న రోజులలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌కు అనుగుణంగా మూసీ ప్రక్షాళనతో పాటు.. సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మూసీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుధీర్‌ రెడ్డి వెంట అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డిప్యూటీ కలెక్టర్ మాలతి, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఇంజినీర్ బీఎల్‌ఎఎన్‌ రెడ్డి, ఈఈ నూర్‌ అహ్మద్, నాగోల్, చైతన్యపురి కార్పొరేటర్లు సంగీత, జిన్నారం విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్

ఇవీ చూడండి:ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

ABOUT THE AUTHOR

...view details