వరద ముంపుకు గురైన అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం ఆదుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని 31మంది వరద బాధితులకు దాదాపు రూ. 15.50 లక్షల చెక్కులు అందజేశారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలతో ప్రజలు ఆందోళనకు గురికావొద్దని కోరారు.
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ముఠా గోపాల్ - ముషీరాబాద్‌లో ముంపు బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిని ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు.
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే ముఠా
నగరంలో వరద సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు గుర్తుచేశారు.
ఇదీ చూడండి:వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి