తెలంగాణ

telangana

ETV Bharat / city

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య - Hyderabad Murder Latest News

సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

By

Published : Nov 3, 2019, 11:21 AM IST

ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు... వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన ఘటన సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి నవీన్ గౌడ్, చోటు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన నవీన్​ గౌడ్​ మామ రమేశ్ గౌడ్ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. ఈ సమయంలో చోటు అనే వ్యక్తి రమేశ్​​ను బలంగా కొట్టడం వల్ల అక్కడిక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

బాధితుడు చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం

ABOUT THE AUTHOR

...view details