తెలంగాణ

telangana

ETV Bharat / city

కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య

రెండు రూపాయలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. సైకిలుకు గాలి కొట్టించి డబ్బులు అడిగినందుకు చెలరేగిన గొడవ హత్యకు దారి తీసిన ఘటన కాకినాడ వలసపాకలో జరిగింది.

కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య

By

Published : Nov 10, 2019, 12:24 PM IST

కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం వలసపాకలలో దారుణం జరిగింది. 2రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వివాదం చివరకు ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్​లో గాలి నింపించుకునేందుకు సాంబ షాపుకు వచ్చాడు.

గాలి నింపిన తర్వాత సువర్ణ రాజును.. సాంబ 2రూపాయలు అడిగాడు. ఆగ్రహించిన సువర్ణరాజు సైకిల్ షాపు యజమాని సాంబను కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు... సువర్ణరాజుని రాడ్డుతో కొట్టాడు. బాధితుడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సువర్ణరాజు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇవీ చూడండి-అన్నం బాలేదన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారు

ABOUT THE AUTHOR

...view details