Rajagopal Reddy: మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నాంపల్లి మండలానికి చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి... నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగానే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముందు చెప్పినట్టే.. పార్టీమార్పుపై వాళ్లతో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు - మునుగోడు నియోజకవర్గం
Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల చెప్పినట్టుగానే.. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలతో సంప్రదింపులు జరుపనున్న రాజగోపాల్‌రెడ్డి.. ఈరోజు నాంపల్లి అనుచరులతో భేటీ అయ్యారు.
Munugodu Mla Komatireddy Rajagopalreddy Meeting With Cader
రోజుకు రెండు మండలాల చొప్పున ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను రాజగోపాల్ రెడ్డి తెలుసుకుంటారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి మండలాలతో పాటు చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల పరిధిలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను రాజగోపాల్ రెడ్డి తెలుసుకోనున్నారు.
ఇవీ చూడండి: