Munugode Bypoll Latest News: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... గ్రామగ్రామాన జోరుగా ప్రచారం సాగిస్తోంది. అధికార తెరాస అభ్యర్థిత్వతంపై స్పష్టత ఇవ్వకున్నా.... మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక... కాంగ్రెస్‌ను వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భాజపా రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నిక సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నికపై భాజపా ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు! - మునుగోడు ఉపఎన్నిక కోసం భాజపా సన్నాహాలు
Munugode Bypoll Latest News: మునుగోడు ఉపఎన్నికపై భాజపా నాయకత్వం దృష్టి సారించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉపఎన్నిక సన్నాహాక సమావేశం జరిగింది. మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి... పార్టీ నేతలు ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, దాసోజు శ్రావణ్, రవీంద్ర నాయక్, గరికపాటి మోహన్ రావు, యేన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ ఇతర నేతలు హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నిక కోసం ఈ స్టీరింగ్ కమిటీని నియమించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం నియమించిన ఈ స్టీరింగ్ కమిటీ... తొలిసారిగా సమావేశమైంది. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరిస్థితి, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇవీ చదవండి: